బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఆయన ఇంట్లోకి చొరబడిన ఓ దుండుగుడు అతనిపై కత్తిపోట్లు వేసిన విషయం తెలిసిందే. దొంగతనానికి వచ్చిన ఓ వక్తిని గుర్తించిన సైఫ్ అలీఖాన్..అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా .. దుండగుడు కత్తితో పలుమార్లు సైఫ్ ను గాయపరిచాడు.
ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స అనంతరం తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కాగా, ఈనెల 15న సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడి వేలిముద్రలు మ్యాచ్ కావడం లేదని తెలుస్తోంది. క్లూస్ టీం ఆయన ఇంట్లోని వేలిముద్రలను సేకరించగా.. వాటిలో ఒక్కటి కూడా షరీపుల్ ఇస్లామ్ వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని సమాచారం .మొత్తం 19 సెట్ల ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తే మొత్తం నాచ్ మ్యాచ్ అని వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది.