శ్రీకాంత్ రెడ్డి ఛానెల్ ను యూట్యూబ్ నుండి తొలగించాలి – కరాటే కళ్యాణి

-

శ్రీకాంత్ రెడ్డి ఛానెల్ ను యూట్యూబ్ నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు సీని నటి కరాటే కళ్యాణి. నిన్న రాత్రి మా తమ్ముడు ఇంటికి వెళ్ళినపుడు నాతో పాటు శ్రీకాంత్ రెడ్డి తో ప్రాంక్ చేసిన అమ్మాయి ఉందని.. ఆ అమ్మాయి శ్రీకాంత్ గతం లో వేదించడాని చెప్పినందుకు అడగడానికి వెళ్ళానని స్పష్టం చేశారు కరాటే కల్యాణి.

అతను చాలా అసభ్యంగా నాతో మాట్లాడాడని… డబ్బులు ఇస్తాను నువ్వు చేయి నాతో అడల్ట్ కంటెంట్ అని అన్నాడని వెల్లడించారు. ఆ మాటకి కోపం వచ్చి నేను చేయి చేసుకున్నానని… ఒకవేళ నేను కావాలనే చేస్తే నాతో పాటు 30 మందిని తీసుకుని వెళ్ళేదాన్నని చెప్పారు కరాటే కల్యాణి.

లక్ష రూపాయలు ఆడిగానని కావాలని నా పై ఆరోపణలు చేస్తున్నాడని.. ఒకవేళ నేను డబ్బు ఆడిగినట్టు ఆధారాలు ఉంటే చూపించమని చాలెంజ్ చేస్తున్నాని పేర్కొన్నారు. తక్షణమే శ్రీకాంత్ రెడ్డి ఛానెల్ ను యూ ట్యూబ్ నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు కరాటే కల్యాణి.

Read more RELATED
Recommended to you

Latest news