కమలంలో ‘పెద్ద’ పంచాయితీ.. ఈటల టార్గెట్ అదేనా?

-

పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది గాని.. తెలంగాణ బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.. ఏదో కాంగ్రెస్ పార్టీలో అంటే నేతలు వీధికెక్కి మరీ రచ్చ చేస్తారు..దీని వల్ల కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ రచ్చ ఉన్నట్లు ఉంటుంది.. కానీ బీజేపీలో కూడా అంతర్గత వైరుధ్యాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.. కాకపోతే బీజేపీ పెద్దలు ఎక్కడకక్కడ అణిచివేసుకుని రావడం, త్వరగా బీజేపీ నేతలు వీధికెక్కపోవడం వల్ల తెలియడం లేదు. కానీ బీజేపీలో పెద్ద పంచాయితీనే ఉన్నట్లు కనిపిస్తోంది.

అది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో ఎక్కువ రచ్చ ఉన్నట్లు తెలుస్తోంది.. నిజానికి బండి పగ్గాలు తీసుకున్నాకే.. తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు వచ్చింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు..కాకపోతే బండి సంజయ్ అంతా తనదే అన్నట్లు ముందుకెళుతున్నారనేది కొందరు సీనియర్ నేతల నుంచి వినిపిస్తున్న వాదన. అంటే బండి ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారని, సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాలకు పెద్దగా సఖ్యత లేదనే టాక్ వస్తుంది..ఇదే క్రమంలో సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా బండి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ కూడా వస్తుంది. ఇలాంటి చర్చ నడుస్తున్న సమయంలోనే తాజాగా ఈటల..ఢిల్లీకి వెళ్ళి కొందరు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. సంజయ్ పాదయాత్ర ముగింపు సమయంలో ఈటల ఢిల్లీకి వెళ్ళి.. ముఖ్య నేతలతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. పార్టీలో తనతో పాటు ఇతర సీనియర్ నేతల సేవలను సక్రమంగా వినియోగించుకోవడం లేదని..బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మరి ఇందులో ఏ మేర వాస్తవం ఉందనేది ఈటలకే తెలియాలి. అదే సమయంలో తెలంగాణ బీజేపీలో ‘పెద్ద’ ఎవరనే దానిపై కూడా రచ్చ నడుస్తున్నట్లు కనబడుతుంది…ఎవరికి వారు సీఎం అభ్యర్ధి అవ్వాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అంతా బీజేపీ అధిష్టానం చేతిలో ఉన్న విషయం తెలిసిందే…మరి చివరికి అధిష్టానం…ఎవరిని పెద్దగా పెడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news