కార్తీ ‘ఖైదీ 2’ షూటింగ్ షురూ అప్పుడే..!

-

విరుమన్‌, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాల సక్సెస్ జోష్ లో ఉన్న కార్తీ.. నెక్స్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సర్దార్‌ మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా తెలుగు బిగ్ బాస్‌ షోకు వెళ్లాడు కార్తీ. ఈ షోలో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు కార్తీ నెక్స్ట్ సినిమా గురించి అడిగారు. ముఖ్యంగా ఖైదీ 2 ఎప్పుడొస్తుందని కార్తీని ప్రశ్నించారు.

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం ఖైదీ. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను రికార్డులతో షేక్ చేసింది. ఈ సూపర్‌ హిట్‌ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌ ఖైదీ 2 షూటింగ్ వచ్చే ఏడాది షురూ అవుతుందని చెప్పాడు కార్తీ.

ఖైదీ 2 చిత్రాన్ని కూడా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించనున్నాడు. పీఎస్‌ మిత్రన్‌ డైరెక్షన్‌లో యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైన సర్దార్‌ చిత్రం మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. సర్దార్ మూవీతో ఫుల్ జోష్ లో ఉన్ కార్తీ ఫ్యాన్స్.. ఖైదీ-2 మూవీ అప్డేట్స్ విని ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version