పెళ్లి పీటలు ఎక్కబోతున్న కార్తీకదీపం మోనిత.. వరుడు ఎవరంటే..?

-

కార్తీకదీపం సీరియల్ లో మోనిత గా విలన్ క్యారెక్టర్ లో నటించి మెప్పించిన శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై మొదటి స్థానంలో నిలిచిన సీరియల్ కార్తీకదీపం. ఈ సినిమాలో డాక్టర్ బాబు, వంటలక్క ఎంత పేరు దక్కించుకున్నారో.. డాక్టర్ బాబు వెంటపడి దీపకు చుక్కలు చూపించిన మోనిత క్యారెక్టర్ కూడా అంతే రేంజ్ లో ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రేక్షకులను అలరించిన ఈ కార్తీక దీపం సీరియల్ సోమవారంతో ముగిసిపోయింది. అప్పట్లో ఈ సీరియల్ లోని పాత్రలను అంత సులభంగా మరిచిపోలేరు. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబును ప్రేమ పేరుతో వేదించే మోనిత పాత్రలో నటించి మెప్పించింది శోభా శెట్టి.

ఇకపోతే తాజాగా మోనిత తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాను అంటూ పెళ్లి చూపులకు రెడీ అవుతున్న వీడియోని కూడా తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారుతుంది. జనవరి 23 సోమవారం రోజున శోభాశెట్టి పెళ్లిచూపులు జరిగాయి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అదే రోజు ఆమె బర్తడే కూడా కావడం విశేషం. ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

శోభిత పెళ్లిచూపులు అనే పదం చెప్పడానికి చాలా సిగ్గుగా ఉంది.. అయితే నాకు తెలియకుండానే నా పుట్టినరోజు నాడు మా అమ్మ నాన్న పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. సిగ్గు పడుతున్నానంటే నాకు పెళ్లి కళ వచ్చేసినట్టే.. పెళ్లి చూపులలో నన్ను చూడడానికి రాబోతున్న అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు అంటే ఆమె తెలిపింది. ఇకపోతే శోభా శెట్టి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరంగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version