కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు కొత్త ఆశయాలు ఉంటాయి. చాలామంది కొత్త సంవత్సరం వస్తున్న కారణంగా తమలో మార్పు రావాలని కోరుకుంటారు. అలాంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే.. మార్పు వచ్చేందుకు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
మారడం చాలా కష్టం. నిజమే.. మార్పు అనేది అంత ఈజీగా రాదు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టాన్ని మీరు భరించగలిగితేనే మీలో మార్పు వస్తుంది.
వ్యాయామం:
ఇప్పటివరకు మీకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేకపోతే ఇకనుంచి మొదలెట్టండి. అయితే చేయాలి కాబట్టి చేయాలన్నట్లుగా కాకుండా.. ఎక్సర్సైజ్ లో కొంత ఫన్ యాడ్ చేయండి. అప్పుడు మీకు డైలీ ఎక్సర్సైజ్ చేయాలన్న ఆసక్తి కలుగుతుంది.
చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకోండి:
మీ గోల్స్ చిన్నవిగా, సాధించే విధంగా ఉండాలి. అవి సాధించినప్పుడు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. దీనివల్ల మీలో ప్రోడక్టివిటీ మరింత పెరుగుతుంది.
మీ శరీరానికి ప్రోటీన్ అందించండి:
మీలో ఎలాంటి మార్పు రావాలన్నా ముందుగా శారీరకంగా బాగుండడం అవసరం. ఆరోగ్యం బాగుండాలంటే ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ ఉన్న ఆహారాలను తినండి.
స్క్రీన్ టైమ్ తగ్గించండి:
ఫోన్ వాడకం, లాప్టాప్ వాడకం బాగా తగ్గించండి, అవసరమైతేనే వాడండి. లేకపోతే అస్సలు వాడకండి. స్క్రోలింగ్ చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు.
మీలో ఉత్సాహాన్ని నింపుకోండి:
మనం ఏది చూస్తామో అదే చేస్తాము. ఆ విధంగానే తయారవుతాం. కాబట్టి మీ లక్ష్యాలను అందుకునేందుకు మోటివేట్ చేసే విషయాలను మాత్రమే చూడండి, పనులను మాత్రమే చేయండి. కచ్చితంగా మీలో మార్పు వస్తుంది.