ఉత్తరాఖండ్ భారీ వరదలను కళ్లకు కట్టినట్టు చూపించారు.. ‘కేదార్ నాథ్’ టీజర్

-

అది 2013. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ కూడా ఆ వరదల్లో మునిగిపోయింది. వేల మంది చనిపోయారు. అదో పెద్ద ప్రకృతి విపత్తు. దాన్ని నేపథ్యంగా తీసుకొని బాలీవుడ్ లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పేరే కేదార్ నాథ్. అభిషేక్ కపూర్ డైరెక్టర్. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్నారు. వరదల్లో ఓ యువకుడు, యువతి మధ్య పుట్టే ప్రేమే ఈ సినిమా. ఈ సినిమా టీజర్ ను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 7 న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version