కీర్తి సురేష్ కొత్త చిత్రం..!

-

మహానటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మళయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఆ సినిమా తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తమిళంలో వరుస అవకాశాలను అందుకుంటున్న కీర్తి సురేష్ తెలుగులో మరోసారి లేడీ ఓరియెంటెడ్ కథతోనే సినిమా చేస్తుంది. నూతన దర్శకుడు నరేంద్ర డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ లో మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈరోజు ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఓపెనింగ్ కు గెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రాం అటెండ్ అవడం జరిగింది. కీర్తి సురేష్ తప్ప మిగతా ఎవరు చేయని ఈ కథ కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version