విశాల్ పెళ్లి ఆమెతోనే..!

-

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ సిని వర్గాలు. తెలుగు వారే అయినా విశాల్ అండ్ ఫ్యామిలీ చెన్నైలోనే ఉంటున్నారు. అక్కడ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. నడిగర్ సంఘం ఎలక్షన్స్ లో కూడా నిలబడి విజయం సాధించిన విశాల్ ఈమధ్య నిర్మాతలతో గొడవతో జైలుకి కూడా వెళ్లొచ్చారు.

ఇదిలాఉంటే విశాల్ పెళ్లిపై స్పెషల్ అప్డేట్ వచ్చింది. విశాల్ తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. నెల్లూరికి చెందినా సరే హైదరాబాద్ లో సెటిల్ అయిన విజయ్ రెడ్డి కూతురు అనీషాతో విశాల్ పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే పెద్దలు మాట్లాడుకోవడం జరిగిందట. త్వరలోనే ఎంగేజ్మెంట్ న్యూస్ అఫిషియల్ గా చెబుతారట. కొన్నాళ్లుగా వరలక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిపించిన విశాల్ తెలుగు అమ్మాయితో పెళ్లికి సిద్ధమవడం ఆశ్చర్యకరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version