పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం.. డిప్యూటీ సీఎం పదవీ చేపట్టడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం తాను పెండింగ్ లో పెట్టిన సినిమాలను పూర్తి చేస్తానని ఇటీవలే ప్రకటించేశాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈనెల 06న ఉదయం 9.06 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
మాట వినాలి అంటూ సాగే పాటను స్వయంగా పవన్ ఆలపించడం విశేషం. జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడం ఖాయమని పవన్ అభిమానులు పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా తొలి పాన్ ఇండియా మూవీగా హరిహరవీరమల్లు తెరకెక్కుతోంది.