పర్రె మేడిగడ్డకు పడలే.. సీఎం రేవంత్ రెడ్డి పుర్రెకు పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ నేతలే ఏదో దొంగచాటుగా చేస్తున్నారనే అనుమానం కలుగుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయని.. కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ ప్రేక్షక పాత్ర పోషించొద్దని కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వం కుట్ర పూరితంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దని ఎవ్వరూ ఏం చేయలేరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై సోషల్ మీడియాల్లో చిల్లర పోస్టులు పెట్టించే వారిని.. పెట్టిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమనీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాక్సింగ్ లో కింద పడ్డా నిలబడి కొట్లాడేటోడో వీరుడు అన్నారు. పార్లమెంట్ ఎన్నిక కాంగ్రెస్ కు 8, బీఆర్ఎస్ 8 సీట్లు వచ్చాయి. మనకు సున్నా.. సీట్లు వచ్చినా భయపడలేదు. మళ్లీ దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు తప్పకుండా వస్తుందని జోస్యం చెప్పారు.