KGF Chapter-2 : కేజీఎఫ్ హవా.. రెండు రోజుల్లో రూ. 240 కోట్లు

-

కేజీఎఫ్ చాప్ట‌ర్-2.. మూడు ఏళ్ల నుంచి ఫ్యాన్స్ ఎదురు చూపున‌కు ఫ‌ర్‌ఫెక్ట్ కిక్ ఇస్తు ఏప్రిల్ 14న విడ‌ద‌ల అయిన విషయం తెలిసిందే. దీంతో భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కేజీఎఫ్ హ‌వా న‌డుస్తుంది. ఎక్క‌డ చూసినా.. విన్న కేజీఎఫ్, య‌ష్ పేర్లే వినిపిస్తున్నాయి. రాకీ భాయ్ మాస్ ఎలివేష‌న్స్ కు ఫ్యాన్స్ స‌లాం చేస్తున్నారు. మూవీ లో ఉన్న ట్వీస్ట్ ల‌కు సాహో ప్ర‌శాంత్ నీల్ అంటున్నారు.

ఒక్క సారి చూసి కూడా మ‌రోసారి చూడాల్సిందే అని ఫ్యాన్స్ థీయేట‌ర్స్ ల‌కు ప‌రుగులు పెడుతున్నారు. కేజీఎఫ్ చాప్ట‌ర్ – 2 బాక్సాఫీస్ ను షేక్ చేడ‌మే కాదు… క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. మొద‌టి రోజు ఒక్క ఇండియాలోనే రూ. 134 కోట్లను కొల్ల‌గొట్టిన రాకీ భాయ్.. వ‌ర‌ల్డ్ వైడ్ గా 150 కోట్ల మార్క్ ను అందుకుంది. కాగ రెండో రోజూ కేజీఎఫ్ జోష్ త‌గ్గ‌లేదు.

మ‌న దేశంలోనే మొద‌టి రెండు రోజుల్లో కేజీఎఫ్ రూ. 240 కోట్ల‌ను సొంతం చేసుకుంది. ఇక ఓవ‌ర్సీస్ తో క‌లుపుకుని ఈ లెక్క రూ. 300 కోట్ల వ‌ర‌కు చేర‌చ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇదే ఊపు కొన‌సాగితే.. అతి త్వ‌ర‌లోనే రూ. 1000 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయ‌మ‌ని కేజీఎఫ్ అభిమానులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news