కేజిఎఫ్ 2 ఫస్ట్ లుక్… హీట్ పెంచేసింది…!

-

ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపిన సినిమా కేజిఎఫ్ చాప్టర్ 1. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హింది భాషల్లో ఒక ఊపేసింది. సినిమా ఆద్యంతం ఉత్కంటను రేపుతూ… ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులను స్క్రీన్ కి కట్టిపడేసింది. ఈ సినిమా దెబ్బకు యష్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కథ మీద నమ్మకం ఉండటంతో హంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది.

కోలార్ గోల్డ్ మైన్స్, ముంబై మాఫియా ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. బానిస బతుకులు ఏ విధంగా మగ్గిపోతాయో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు దర్శకుడు చూపించారు. హీరో నటనకు, అతని స్టైల్ కి కూడా అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులను మైమరిపించింది. అయిదు భాషల్లో వచ్చిన ఈ సినిమా… వరల్డ్ వైడ్ గా 238 కోట్ల వసూళ్లను సాధించి రికార్డ్ సృష్టించింది. అధీరా తమ్ముడు గరుడని హీరో చంపడంతో ముగిసిన తొలి పార్ట్…

అక్కడి నుంచి రెండో పార్ట్ మొదలుకానుంది. తాజాగా కేజిఎఫ్ పార్టీ 2కి సంబంధించిన లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ ని డిసెంబర్ 21 సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని హీరో, దర్శకుడు సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన మాట ప్రకారం కాసేపటి క్రితం లుక్ ని విడుదల చేసారు. రెండో పార్ట్ లో అధీరాగా సంజయ్ దత్ నటిస్తుండగా, దివంగత ప్రధాని ఇందిరా గాంధీని పోలిన పాత్రలో రవీనా టాండన్ నటిస్తుంది. ఇప్పుడు లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news