కేజీయఫ్ స్టార్ హీరో యశ్ పుట్టినరోజున కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. రాఖీ భాయ్ బర్త్ డే సందర్భంగా కటౌట్‌లు ఏర్పాటు చేస్తూ కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను తాజాగా యశ్ పరామర్శించాడు. వారిని ఓదార్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యాడు.
కర్ణాటకలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయని తెలిసి ఈసారి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోకూడదని అనుకున్నానని యశ్ చెప్పాడు. ఈ విషయం నా ఫ్యాన్స్ కు నాలుగు రోజుల క్రితమే చెప్పానని తెలిపాడు. తనను కలిసేందుకు కూడా రావొద్దని చెప్పినట్లు వెల్లడించాడు. కానీ తన మాట వినకుండా తన పుట్టిన రోజు వేడుకలు చేసే క్రమంలో తన అభిమానులు ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్రమాదాలు చూస్తుంటే బర్త్ డే అంటేనే తనకు భయమేస్తోందని యశ్ ఎమోషనల్ అయ్యాడు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేమన్న యశ్.. ఇకపై మృతి చెందిన అభిమానుల కుటుంబాల బాధ్యత తనదేనని చెప్పాడు.