ప్రస్తుతం చేస్తున్ననాలుగు సినిమాలు దేనికదే పూర్తి భిన్నమైనవి కావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నా టాలెంట్‌ని గుర్తించి ఇలాంటి ఆఫర్స్ నా వద్దకు వస్తున్నందుకు సో హ్యాపీ. ఇది ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా అని కైరా చెప్పింది.
వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడపడంతో తన హెయిర్‌ని మెయింటేన్ చేయలేకపోతున్నానని కైరా ఏకంగా జుట్టుని కట్ చేసుకుని రీసెంట్ గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లని గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అటూ ఫ్యాన్స్ ని, ఇటు ఫిల్మ్ వర్గాలని సర్ ప్రైజ్ చేస్తోంది.
ఇటీవల కళంక్‌లో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పుడు వరుసగా కబీర్ సింగ్, గుడ్ న్యూస్, లక్ష్మీబాంబ్ చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ని అందుకుంది. కరణ్ జోహార్ నిర్మించే ప్రిస్టీజియస్ ఫిల్మ్ షేర్షాలో నటించే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఈ చిత్రంలో నటించనుంది. కార్గిల్ వార్ బేస్డ్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. విష్ణు వర్థన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనన్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా కైరా తన ఎగ్జైట్ మెంట్‌ని ప్రకటించింది. డిఫరెంట్ కైండ్ ఆప్ రోల్స్ చేయడానికి సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉంటాను.
ప్రస్తుతం చేస్తున్ననాలుగు సినిమాలు దేనికదే పూర్తి భిన్నమైనవి కావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నా టాలెంట్‌ని గుర్తించి ఇలాంటి ఆఫర్స్ నా వద్దకు వస్తున్నందుకు సో హ్యాపీ. ఇది ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా అని కైరా చెప్పింది. కైరా తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామలో మెరిసిన విషయం విదితమే.