శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కిమ్స్ ఆసుపత్రి..!

-

సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో జరిగిన సమయంలో తొక్కిసలాటలో గాయపడ్డ ఓ మహిళా మృతి చెందగా ఆమె కొడుకు శ్రీ తేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆ అబ్బాయి శ్రీ తేజ కు సంబంధించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది కిమ్స్ ఆసుపత్రి. అందులో శ్రీ తేజ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొంది.

అలాగే ఇన్ని రోజులు కోమాలో ఉన్న శ్రీ తేజ ప్రస్తుతం.. ఆక్సిజన్ అవసరం లేకుండానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు అని తెలిపారు. ఆలాగే ఆహారాన్ని కూడా తీసుకోగలుగుతున్నాడు. కానీ శ్రీ తేజకు అప్పుడప్పుడు జ్వరం వస్తోంది అని వివరించారు. కానీ అతని నాడీ వ్యవస్థ స్థిరంగా పనిచేస్తోంది అని హెల్త్ బులిటెన్ లో వివరించారు. అయితే శ్రీ తేజ ఆసుపత్రి బిల్స్ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news