డోంట్ మిస్ వైల్డ్ డాగ్.. నాగ్ సినిమాకు మెగాస్టార్ రివ్యూ..!

Join Our Community
follow manalokam on social media

కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా వైల్డ్ డాగ్ సినిమా చూసిన చిరు ప్రతి భారతీయుడు, ప్రతి తెలుగు వాడు ఈ సినిమా తప్పక చూడాలని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్ ను కథాంశంగా తీసుకుని వైల్డ్ డాగ్ డైరక్టర్ సోలమన్ అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు.

సోదరుడు నాగార్జునతో పాటుగా చిత్రయూనిట్ అందరికి మెగాస్టార్ చిరంజీవి తన అభినందనలు తెలియచేశారు. వైల్డ్ డాగ్ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది. ఆఫీసర్, మన్మథుడు 2 సినిమాల తర్వాత నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ కింగ్ నాగార్జున ఖాతాలో హిట్ పడేలా చేసింది. ఈ సినిమా తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్ మూవీ బంగర్రాజు సినిమాను కూడా త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. వైల్డ్ డాగ్ తో నాగార్జున మళ్లీ ఫాంలోకి వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...