ఓటీటీలోకి కింగ్ ఆఫ్ కొత్త హిందీ వర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

 దుల్కర్ సల్మాన్ హీరోగానటించిన యాక్షన్ సినిమా కింగ్ ఆఫ్ కొత్త. మలయాళంలో కొత్త అంటే టౌన్ అని అర్థం. దీనిని యథాతథంగా తెలుగులో అదే పేరుతో విడుదల చేశారు. అభిలాస్ జోషి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకి ఆయా భాషల్లో దుల్కర్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. 

ప్రేమ కథల్లో దుల్కర్ ని చూసి అలవాటు పడిపోయిన అభిమానులు ఈ యాక్షన్ సినిమాను ఆదరించలేదు. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ మినహా మిగతా అన్ని భాషల్లో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా హిందీ వర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ఇతర భాషల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కింగ్ ఆప్ కొత్త హిందీ భాషల్లో అక్టోబర్ 20 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు వెల్లడించింది. 20 రోజులు ఆలస్యంగా హిందీ వర్షన్ ఓటీటీలోకి వస్తోంది. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ మొత్తానికి హిందీ వర్షన్ డేట్ ప్రకటించారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version