ఉద‌యనిధి స్టాలిన్ కొత్త సినిమా.. హీరోయిన్‌గా కీర్తి సురేష్

-

త‌మిళ హీరో, ఎమ్మెల్యే ఉద‌యనిధి స్టాలిన్ హీరోగా కొత్త సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను చిత్ర బృందం ఫైన‌ల్ చేసింది. ఈ సినిమా గ‌త ఏడాది వేస‌విలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సిఉంది. అయితే స్టాలిన్ త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం అందులో విజ‌యం సాధించ‌డంతో ఈ సినిమా షూటింగ్ పెండింగ్ లో ప‌డింది. అయితే తాజా గా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ల‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు. అలాగే ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ న‌టించ‌నున్నారు.

అలాగే ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా ఎ. ఆర్ రెహ‌మ‌న్ ను చిత్ర బృందం ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను ఈ నెల‌లోనే షూటింగ్ ప్రారంభించే అవ‌కాశం ఉంది. కాగ కీర్తి సురేష్ వ‌రుస సినిమాల‌తో బిజీ గా ఉంది. కీర్తి సురేష్ ప్ర‌స్తుతం చిరంజీవి భోళా శంక‌ర్, మ‌హేశ్ బాబు స‌ర్కారు వారి పాట తో పాటు సాని కాయిదం అనే సినిమాల షూటింగ్ ల‌లో పాల్గొంటుంది. అలాగే గుడ్ ల‌క్ స‌ఖీ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news