కరోనా దెబ్బకు కిస్ సీన్స్ బ్యాన్ చేసేసారు…!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ప్రతీ ఒక్కరు భయపడిపోతున్నారు. ఎం చెయ్యాలన్నా సరే ఇప్పుడు భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. కనీసం పిల్లలకు ముద్దు పెట్టాలి అన్నా సరే తల్లి తండ్రులు భయపడుతున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. సినిమాలకు కూడా కరోనా ప్రభావం తగిలింది.

కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో తైవాన్‌లో రూపొందించే సీరియల్స్‌లో కిస్సింగ్ సీన్స్‌ను అక్కడి ప్రభుత్వం బాన్ చేసింది. వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సీరియల్స్‌లో కిస్సింగ్ సీన్స్ ఉండకూడదని తైవాన్‌ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తైవాన్‌లోని టీవీ కళాకారులకు సీరియల్స్‌లో కిస్సింగ్ సీన్స్ ఉండకూడదని, కళాకారులు షూటింగ్ సమయంలో దగ్గరగా ఉంటూ మాట్లాడుకోకూడదని సూచించింది.

అదే విధంగా కరోనా వైరస్ ప్రభలకుండా ఉండేందుకు గాను అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. తైవాన్‌కు చెందిన ఫోర్మోసా టీవీలో ప్రసారమయ్యే సీరియల్ గోల్డల్ సిటీలో నటి మియా చివూ, నటుడు జూన్ ఫూ మధ్య కిస్సింగ్ సీన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనితో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు వార్త హాట్ టాపిక్ గా మారింది.