క‌రోనా టైంలో బ‌న్నీ – ఎన్టీఆర్ ఈ కొత్త షాకులు ఏంటో…?

-

ప్ర‌స్తుతం క‌రోనా వేళ ఇండ‌స్ట్రీలు అన్నీ బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్‌లు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో ?   అస‌లు థియేట‌ర్లు ఎప్పుడు తెర‌చుకుంటాయో ?  తెలియ‌ని ప‌రిస్థితి. వీటిపై న‌మ్మ‌కం లేని చాలా మంది త‌మ సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ టైంలో హీరోలు ఖాళీగా ఉండ‌డంతో కొత్త క‌థ‌లు వింటూ త‌మ‌కు న‌చ్చిన క‌థ‌లు ఓకే చేయించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో ఓ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై కొరటాల ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఆచార్య మూవీ కంప్లీట్ అయిన వెంటనే బన్నీతో సినిమా స్టార్ట్ అవుతుంది.

ప్ర‌స్తుతం కొర‌టాల చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బ‌న్నీతో సినిమా ఉంటుంది. అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉన్న‌ట్టు కూడా తెలుస్తోంది. కొర‌టాల శివ ఎన్టీఆర్ చేయాల్సిన కథతోనే బన్నీ సినిమా చేయబోతున్నాడంటూ ఇండ‌స్ట్రీలో పుకార్లు బ‌య‌లు దేరాయి. ఇది చాలా మందికి పెద్ద షాక్‌లా అనిపించింది. అయితే దీనిపై ఆరా తీయ‌గా ఇందులో ఎలాంటి నిజం లేద‌ని తేలింది. వాస్త‌వంగా చూస్తే కొర‌టాల బెస్ట్ ఫ్రెండ్ అయిన మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా కొర‌టాల ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాలి.. అయితే ఎన్టీఆర్ క‌రోనా నేప‌థ్యంలో ఆర్ ఆర్ ఆర్‌తో మ‌రో యేడాది పాటు లాక్ అవ్వ‌క త‌ప్ప‌దు.

అందుకే కొర‌టాల ఇప్పుడు బ‌న్నీ వైపు షిఫ్ట్ అయ్యాడ‌ట‌. ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసుకుని.. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా చేయాలి.. ఇవ‌న్నీ చాలా టైం ప‌ట్టే ఛాన్స్ ఉండ‌డంతోనే ఇప్పుడు కొర‌టాల బ‌న్నీతో సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ని అంటున్నారు. అంతే కాని ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన క‌థ‌తో కొర‌టాల ఇప్పుడు బ‌న్నీతో క‌మిట్ అయ్యాడ‌న్న ప్ర‌చారంలో వాస్త‌వం ఏ మాత్రం లేద‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక అల వైకుంఠ‌పురంలోలో సినిమా త‌ర్వాత బ‌న్నీ సూప‌ర్ ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version