పెళ్లి పీటలెక్కబోతున్న పవన్ కల్యాణ్ బ్యూటీ

-

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ జాబితాలో తీన్మార్ బ్యూటీ కృతి కర్బందా కూడా చేరబోతున్నట్లు సమాచారం. తన కో స్టార్, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్తో కృతి వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. గతంలోనే తాము మార్చిలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఈ జంట హింట్ ఇవ్వగా, ఇప్పుడు వీళ్ల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఎంతో క్యూట్ అండ్ సింపుల్గా ఉన్న ఆ వెడ్డింగ్ కార్డు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. కృతి, పుల్కిత్తో పాటు తమ పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి. కానీ వెడ్డింగ్ వెన్యూ, ఇంకా ఈ పెళ్లికి సంబంధించిన ఆ కార్డులో డీటైల్స్ లేవు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట మార్చి 13న ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది.

కృతి ‘బోణీ’ అనే తెలుగు సినిమాతో కృతి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘తీన్‌మార్’, ‘అలా మొదలైంది’, ‘మిస్టర్ నూకయ్య’, ‘ఒంగోలు గిత్త’, ‘ఓం త్రీడీ’, ‘బ్రూస్ లీ’ వరుస ఆఫర్లతో బిజీ అయింది. ఆ తర్వాత బాలీవుడ్కు మకాం మార్చింది.

Read more RELATED
Recommended to you

Latest news