మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన మాలీవుడ్ మూవీ ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. మమ్ముట్టి నటన, రాహుల్ టేకింగ్ ‘భ్రమయుగం’ను ఓ డిఫరెంట్ సినిమాగా నిలిపాయి. రూ.27 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది.
ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్‌లో మార్చి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించింది. మలయాళంతో పాటు, తెలుగ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ‘భ్రమయుగం’ స్ట్రీమింగ్ కానుంది. మరో రెండు వారాల్లో రానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లో చూడటం మిస్ అయినా ఓటీటీలో మిస్ అయ్యే ఛాన్సే లేదని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.