ఆర్ ఆర్ ఆర్ మూవీ క్రేజ్ తో వ్యాపారం : ఫ్యాన్స్ కోసం టీషర్ట్స్, మాస్క్ లు !

-

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్… సినిమా కోసం ఆటో మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు టాప్ హీరోలు ఈ సినిమా చేయడంతో… భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ నుంచి ఏ చిన్న విషయం లీకైన.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ లు రికార్డులను తిరగ రాస్తున్నాయి.

అయితే… దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ క్రేజ్‌ ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు వ్యాపారులు. టీ షర్ట్స్‌, మాస్క్‌లు, మగ్స్‌ లాంటి ఫ్యాషన్‌ వస్తువులను ఆర్‌ఆర్‌ఆర్‌ బ్రాండ్‌ నేమ్స్‌ తో అమ్మేస్తున్నారు. ఇక హీరో దగ్గుబాటి రానా ఆర్‌ఆర్‌ఆర్‌ వ్యాపారానికి సంబంధించిన అఫిషియల్‌ వెబ్‌ సైట్‌ ను లాంచ్‌ చేశారు. ఇందులోభాగంగానే.. ఆర్‌ ఆర్‌ఆర్‌ బ్రాండ్‌ నేమ్స్‌ తో టీ- షర్ట్స్‌, మాస్క్‌లు మరియు మగ్స్‌ ను విడుదల చేశాడు హీరో రానా. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news