టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ..తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. మ్యారేజ్ తర్వాత వెండితెరకు దూరమైన ఈ నటి..త్వరలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నదని వార్తలొస్తున్నాయి. ఈ సంగతులు పక్కనబెడితే..తాజాగా లయ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసి ఎమోషనల్ అయింది.
గణేష్ గోరటి – లయల వివాహ వార్షికోత్సవం కాగా, ఈ సందర్భంగా తన పెళ్లి వీడియోను షేర్ చేసింది. తనకు వెడ్డింగ్ యానివర్సిరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థాంక్స్ చెప్పింది. ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్తున్నట్లు క్యాప్షన్ ఇచ్చి ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన పెళ్లి వీడియోను షేర్ చేసింది సీనియర్ హీరోయిన్ లయ.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు లయ చివరగా మాస్ మహారాజా రవి తేజ హీరోగా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కనిపించింది. లయ త్వరలో త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.