లాక్ డౌన్ హీరో సోనూసూద్.. ఇప్పుడు పంజాబ్ స్టేట్ ఐకాన్..!

లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులకు అతడు దేవుడయ్యాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు. చదువు లేని వారికి చదువుని అందించిన గురువు. ఇన్నీ చేసిన నేనోక మానవమాత్రుడేనని చెప్పి తన ఔనత్యాన్ని చాటుకున్నాడు.. అతనే సోనూసూద్ విలన్ గా సినిమాలో పరిచయమైన ఈ నటుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా రియల్ హీరో అయ్యాడు. ఇక సోనూసూద్ గురించి తన దాత్రుత్వం గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

కాగా, తాజాగా సోనూసూద్‌ను పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్.కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను ఆమోదించింది. దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ ది పంజాబ్ రాష్ట్రం లోని మోగా జిల్లా.

కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు బస్సులను ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. వివిధ దేశాలలో చిక్కుకుపోయిన మన దేశస్తులను సొంత ఖర్చులతో విమానం ఏర్పాటు చేసి.. వారందరినీ స్వస్థలాకు చేర్చాడు. అనేకమంది పేద పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలను అందించాడు. వ్యవసాయం చేసుకునే వారికి ట్రాక్టర్ ని ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నాడు. జాతి, కులం, మతం అనే తేడా చూడకుండా ప్రతి ఒక్కరికి నేనున్నా అనే భరోసాని కల్పించాడు. కష్టపడే వారికి అండగా నిలచాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్నీ ఇన్నీ కాదు. అయితే, తన సేవలను గుర్తించి ఇటీవల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డీపీ) ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును బహుకరించిన విషయం తెలిసిందే. సీని ఇండస్ట్రీ వారు కూడా తనని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఏ రాష్టంలో చూసిన సోనూసూద్ కు పట్టం కడుతున్నారు. సోనూసూద్ పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం, ప్రజలు ప్రత్యేక గుర్తింపును అందిస్తోంది.