‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్ రిలీజ్

-

టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  ‘మా నాన్న సూపర్‌ హీరో’. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఆర్ణ కథానాయిక. సాయాజీ షిండే, ఆమ‌ని, హ‌ర్షిత్ రెడ్డి త‌దిత‌రులు కీలక పాత్రలు  పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్స్‌, క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 11న దసరా కానుకగా  ఈ  మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అందులో భాగంగా ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చేతుల మీదుగా ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. ఒక‌ప్పుడు ఈ డ‌బ్బు అవ‌స‌ర‌మే నా కొడుకును దూరం చేసింది.. దాని విలువ పాతిక సంవ‌త్స‌రాలు అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. నాన్న సెంటిమెంట్‌తో సినిమా ఉండ‌నున్న‌ట్లుగా ట్రైల‌ర్‌ను బ‌ట్టి స్పష్టంగా అర్థ‌మ‌వుతోంది. తండ్రి కొడుకుల బంధం, తండ్రి కొడుకు కోసం ఏం చేశాడు.. కొడుకు తండ్రి కోసం ఏం చేశాడు. వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి..? అనే కోణంలో చూపించాడు.  మొత్తానికి ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీక్షించండి.

Read more RELATED
Recommended to you

Latest news