Tollywood: తెలంగాణ డీజీపీకి మా అసోసియేషన్ ఫిర్యాదు

-

Maa association’s complaint to Telangana DGP: తెలంగాణ డీజీపీకి మా అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ డీజీపీకి సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ బృందం ఫిర్యాదు చేసింది. మా అసోసియేషన్, నటీనటుల పై అసభ్య కరమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ బృందం పేర్కొంది. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

Maa association’s complaint to Telangana DGP

ఇప్పటికే ఈ ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు మా అసోసియేషన్ బృందం. ఆ ఫిర్యాదుకు సంబంధించిన కాపీలను డీజీపికి అందజేశారు. యూ ట్యూబ్ లింకులు, స్క్రీన్ షాట్లను డీజీపీ కి అందజేశారు రఘుబాబు, శివబాలాజీ. లేడీ ఆర్టిస్టుల పై వస్తున్న ట్రోల్ చాలా దారుణంగా ఉన్నాయి…. కుటుంబాలు చాలా బాధ పడుతున్నారన్నారు. క్యారెక్టర్ ను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news