MacherlaNiyojakavargam : “మాచర్ల నియోజకవర్గం” నుంచి టీజర్‌..దుమ్ములేపిన నితిన్‌

-

హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం హీరో నితిన్‌ “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కుతోంది.

“మాచర్ల నియోజకవర్గం” సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా “మాచర్ల నియోజకవర్గం” నుంచి టీజర్‌..ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇవాళ హీరో నితిన్‌ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలోనే… ఈ టీజర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ టీజర్‌ లో నితిన్‌ ఫుల్‌ మాస్‌ గా కనిపించాడు. ఓ ఫైట్‌ సీన్‌ ను ఈ టీజర్‌ లో చూపించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. మొత్తానికి ఈ టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.

https://www.youtube.com/watch?v=-vwY1ReFLlk

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news