మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ మడోనా సెబాస్టియన్ ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండగా మడోనా కూడా ఒకరు. ఈ సినిమా దక్షిణాదిన మంచి విజయం సాధించడంతో మడోనా కూడా పాపులర్ అయ్యింది. ఈ సినిమా తరవాత పలు తమిళ, మలయాళ సినిమాలు చేసింది కానీ అనుకున్నమేర ఆ సినిమాలు విజయం సాధించలేకపోయాయి.
ఇక అదే ప్రేమమ్ తెలుగు రీమేక్ లో నాగచైతన్యకు జోడీగా నటించి మడోనా ఆకట్టుకుంది. కానీ తెలుగులో కూడా మడోనా సక్సెస్ అవ్వలేకపోయింది. నిజానికి మడోనా సింగర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. పలు మలయాళ సూపర్ హిట్ పాటలను పాడి శ్రోతలను అలరించింది. అందమైన గొంతుతో పాటూ అందంగా ఉండటం తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రీసెంట్ గా ఈ మలయాళ బ్యూటీ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో సీరియల్ పాత్రలో నటించింది. అసలు గ్లామర్ కు ఎలాంటి స్కోప్ లేని ఈ పాత్రలో మడోనా నటించడం సాహసమేనని చెప్పాలి. ఇక ఈ పాత్రలో మడోనాను నాచురల్ గా చూపించారో లేదంటే పాత్రకు సరిపోయేలా ఉండాలని డీ గ్లామర్ గా చూపించారో గానీ అంతా బ్యూటీని చూసి అవాక్కయ్యారు. మడోనా ఏంటి ఇంత దారుణంగా ఉందని అనుకున్నారు.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తాన అందాల ప్రదర్శనతో ఆ కామెంట్లకు చెక్ పెట్టేసింది. రెడ్ కలర్ పట్టు చీరలో జాకెట్ లేకుండా హొయలు వలుకబోస్తోంది. కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు సూపర్ అంటున్నారు.