పీఆర్సీ ఇష్యూ: చర్చలకు వెళ్లేది లేదు…. ప్రభుత్వ కమిటీకి ఉద్యోగుల తరుపున లేఖ

-

ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ ఇష్యూపై రగడ కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులు తగ్గదే లే అంటున్నారు. తాజాగా ఈరోజు కూడా ప్రభుత్వ కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. అయితే నిన్నటి మాదిరిగానే నేడు కూడా చర్చలకు వెళ్లవద్దని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పెద్దల కోసం ప్రభుత్వ కమిటీ ఎదురుచూస్తోంది.

ఇదిలా ఉంటే… ప్రభుత్వ కమిటీకి ఉద్యోగుల తరుపున పీఆర్సీ సాధన సమితి లేఖ రాయాలని నిర్ణయించింది. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని లేఖలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాలు వస్తే చర్చిస్తామని.. ఉద్యోగులకు ఉన్న అనుమానాలను తీరుస్తామని ప్రభుత్వం తెలుపుతోంది. కాగా జీవోను రద్దు చేసిన తర్వాతే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఒకవేళ చర్చలకు వెళ్తే.. కొత్త పీఆర్సీ జీవోను ఒప్పుకున్నట్లే అని ఉద్యోగులు అనుకుంటున్నారు. దీంతో చర్చలకు వెళ్లవద్దనే నిర్ణయం తీసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news