Maha Samudram Movie: ప్ర‌ముఖ ఓటీటీలో సందడి చేయ‌నున్న ‘మహా సముద్రం’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

Maha Samudram Movie: ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కిన చిత్రం ‘మహా సముద్రం’ . లవ్ అండ్ యాక్షన్ థ్రిల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ లు మ‌ల్టీ స్టార‌ర్ గా న‌టించారు. అతిది రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత సిద్ధార్థ కూడా ఈ సినిమా తో తెలుగు లో రీ ఎంట్రీ ఇస్తుండడంతో చాలా అంచనాలు పెట్టుకున్నాడు.

ఈ మేర‌కు ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 14వ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ మూవీ. భారీ అంచనాల న‌డుమ తెర‌కెక్కిన అనుకున్న స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే.. ఈ చిత్రం ఓటీటీ వేదిక‌గా.. సంద‌డి చేయడానికి వ‌స్తుంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్‌లో శనివారం( నేటీ) నుంచి స్ట్రీమ్ కాబోతుంది.

ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను నెట్ ఫిక్ల్స్ సంస్థ దాదాపు పదకొండు కోట్లకు కైవ‌సం చేసుకున్న‌ట్టు సమాచారం. థియేటర్ ప‌రంగా హీట్ కానీ ఈ చిత్రం ఓటీటీలో మేర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి. ఇక మహా సముద్ర తర్వాత శర్వానంద్ ప్రస్తుతం “ఒకే ఒక జీవితం”, “ఆడాళ్లు మీకు జోహార్లు” వంటి సినిమాలలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version