రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ కనిపించబోతున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్‌మన్‌గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో కీలక పాత్రలో స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని కనిపించబోతున్నాడు. రామ్ చరణ్‌కు కోచ్‌గా ధోనీ నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా…రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయిన సంగతి తెలిసిందే.