మ‌రో బ్రాండ్ కు మ‌హేష్ బాబు అంబాసిడ‌ర్

టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మ‌హేష్ బాబు వాణిజ్య ప‌రం గా దూసుకు పోతున్నాడు. తాజా గా ఆయ‌న ఒక ప్ర‌ముఖ కంపెనీ కి అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ విష‌యాన్ని అధికారికం గా ఆయ‌న ట్విట్ట‌ర్ లో పెర్కొన్నారు. ప్ర‌ముఖ సాఫ్ట్ కూల్ డ్రింక్ మౌంటెన్ డ్యూ అనే బ్రాండ్ కు ప్రిన్స్ మ‌హేష్ బాబు అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

దీని కోసం మహేష్ బాబు రూ. 15 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం అయితే అయితే ప్రిన్స్ మ‌హేష్ బాబు ఇప్ప‌టి కే ఐడియా, సంతూర్, ప్యార‌గ‌న్, అభి బ‌స్, తో పాటు థంప్స్ అప్ బ్రాండ్ ల‌కు అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే ఆయ‌న లీస్ట్ లో కూల్ డ్రింక్ మౌంటెన్ డ్యూ కూడా చేరింది. కాగ గ‌తం లో మౌంటెన్ డ్యూ కు అంబాసిడ‌ర్ గా అక్కినేని అఖిల్ ఉండే వాడు. ఆయ‌న కాంట్రాక్ట్ ముగియ‌డం తో తాజా గా ప్రిన్స్ మ‌హేష్ బాబు ను మౌంటెన్ డ్యూ కంపెనీ తీసుకుంది.