ముగిసిన రెండో రోజు ఆట… భారీ ఆధిక్యంలో ఇండియా

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సాగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆది నుంచి టీమిండియా దూకుడుగా ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్ రెండో రోజు ఆట కాసేపటి క్రితమే ముగిసింది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి… రెండో ఇన్నింగ్స్ లో 21 ఓవర్లు ఆడిన టీమిండియా.. వికెట్లు ఏమి నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 38 పరుగులు అలాగే పుజారా 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు.. 28 ఓవర్లలో కేవలం 62 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక ప్రస్తుతం టీమిండియాకు 332 పరుగులు లీడ్ లభించింది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన మూడవరోజు ఆట రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.