నాగచైతన్య చేతుల మీదుగా.. “లక్ష్య” రొమాంటిక్ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా నటిస్తున్న సినిమా లక్ష్య. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను… ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ నారాయణ దాస్ కె నా రంగు, పి రామ్ మోహన్ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ, హీరోయిన్‌ గా నటిస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. సాయ..సాయ అంటూ సాగే రొమాంటిక్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ అక్కినేని నాగ చైతన్య చేతులమీదుగా విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ లో హీరోయిన్ కేతిక అదరగొట్టింది. హీరో నాగ శౌర్య, కీర్తిక ల మధ్య లవ్ బాండ్ చాలా చక్కగా కుదిరింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన థియేటర్ల లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.