106 ఏళ్ళ బామ్మ కోరిక తీర్చిన మహేష్.. నిజమైన సూపర్ స్టార్

-

స్టార్ ఇమేజ్ అంటే కోట్ల కొద్ది డబ్బు.. లక్షల మంది ఫ్యాన్స్. ఎక్కడకు వెళ్లినా స్టార్స్ కు ఉండే క్రేజ్ వేరు. అలాంటి స్టార్స్ ఏదో ఒకటైంలో తమను అభిమానిస్తున్న ఫ్యాన్స్ కు అందుబాటులోకి వస్తారు. వారి కోరికలను తీరుస్తారు. లేటెస్ట్ గా అలాంటి ఓ అద్భుత సంఘటన జరిగింది. రాజమండ్రికి చెందిన 106 ఏళ్ల వయసు కలిగిన రేలంగి సత్యవతి మహేష్ బాబుని చూడాలన్న కోరిక బయటపెట్టింది.

ఆమె మహేష్ తో ఫోటో దిగాలన్న కోరిన బయటపెట్టడంతో మీడియా ఆ వార్తని వైరల్ చేసింది. అది కాస్త మహేష్ దాకా వెళ్లింది. అప్పుడు అమెరికా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ హైదరాబాద్ వచ్చాక ఆమెను పిలిపించుకుని మరి ఆమె కోరిక తీర్చి పంపించాడు. మహర్షి సెట్స్ కు సత్యవతిని రప్పించుకుని ఆమెతో కాసేపు ముచ్చట్లాడి ఆమెతో ఫోటో దిగి పంపించాడు మహేష్. మహేష్ ను కలిసిన ఆమె భావోద్వేగం అయ్యింది.

తారలుగా పుట్టడం అదృష్టం.. నిజంగా అంత ఏజ్ ఉన్న ఆవిడ వచ్చి మహేష్ ను చూసి కన్నీళ్లు పెట్టుకుంది అంటే నిజంగా స్టార్స్ ఎంత అదృష్టవంతులో మరోసారి అర్ధమవుతుంది. రాజమండ్రి మహేష్ ఫ్యాన్స్ సత్యవతి రాకపోకలు చూసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పండుముసలావిడ కోరిక తీర్చి మహేష్ బాబు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version