మ‌హేష్‌బాబు నిర్మాత‌గా విజ‌య్ దేవ‌రకొండ చిత్రం..?

-

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ప్ర‌స్తుతం యూత్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోల్లో ఒక‌డిగా విజ‌య్ దూసుకుపోతున్నాడు.

ప్ర‌ముఖ న‌టుడు మ‌హేష్ బాబు ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఏఎంబీ సినిమాస్ పేరిట మ‌ల్టీప్లెక్స్‌ను ప్రారంభించి ఆ వ్యాపారంలో ముందుకు దూసుకుపోతున్న మ‌హేష్.. ఇటీవ‌లే నిర్మాత‌గా కూడా మారారు. అడివి శేష్ హీరోగా మ‌హేష్ బాబు నిర్మాణంలో మేజ‌ర్ అనే సినిమా ప్ర‌స్తుతం షూటింగ్‌ను జ‌రుపుకుంటుండ‌గా, వ‌చ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఇదే కాకుండా ఇప్పుడు మ‌రో యువ హీరో, రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనూ మ‌హేష్ బాబు నిర్మాత‌గా ఓ సినిమా తీయ‌నున్నార‌ట‌.

మ‌హేష్ బాబు భార్య, న‌టి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ మ‌హేష్‌కు ఎంత అండ‌గా ఉంటారో అంద‌రికీ తెలిసిందే. అయితే ఆమె ఈ మ‌ధ్య మ‌హేష్ వ్యాపారాల‌ను కూడా చూసుకుంటున్నారు. కుమారుడు గౌతమ్‌, కుమార్తె సితార‌లు కొంచెం ఎద‌గ‌డంతో ఇక న‌మ్ర‌త.. మ‌హేష్ వ్యాపారాల‌ను పూర్తి స్థాయిలో చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండతో సినిమా తీయాల‌నే ఆమె మొద‌ట‌గా మ‌హేష్‌కు సూచించార‌ట‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ప్ర‌స్తుతం యూత్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోల్లో ఒక‌డిగా విజ‌య్ దూసుకుపోతున్నాడు. గ‌తంలో వ‌చ్చిన విజ‌య్ చిత్రాలు నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ను పండించాయి. దీంతో విజ‌య్‌తో సినిమా తీస్తే బాగుంటుంద‌ని న‌మ్ర‌త భావించార‌ట‌. అందులో భాగంగానే విజ‌య్‌ను ఈ విష‌య‌మై న‌మ్ర‌త సంప్ర‌దించిన‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలో అతి త్వ‌ర‌లోనే మ‌హేష్ బాబు నిర్మాత‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ చిత్రం ప్రారంభ‌మ‌వుతుందని సినీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఆ సినిమా నిజంగానే ప‌ట్టాలెక్కుతుందా.. లేదా మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version