సుకుమార్ కు హ్యాండ్ ఇస్తున్న మహేష్

-

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ రిలీజ్ అవనున్న ఈ సినిమా తర్వాత మహేష్ తన 26వ సినిమా సుకుమార్ తో చేస్తాడని తెలిసిందే. అయితే ఎనౌన్స్ అయితే చేశారు కాని మహేష్ ను మెప్పించే కథ కోసం సుకుమార్ పాట్లు పడుతూనే ఉన్నాడు. రెండు మూడు స్టోరీ లైన్స్ వినిపించినా ఇంకా బెటర్ గా కావాలని అన్నాడట. సుక్కు స్క్రిప్ట్ రాసుకునే పనిలోనే ఉన్నాడు.

ఈ గ్యాప్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి మహేష్ కు కథ వినిపించాడట. కథ విన్న మహేష్ సర్ ప్రైజ్ అయ్యాడట. పటాస్ నుండి ఎఫ్-2 వరకు అనీల్ సూపర్ హిట్ ట్రాక్ మెయింటైన్ చేశాడు. దానితో పాటుగా చెప్పిన కథ కూడా నచ్చడంతో మహేష్, అనీల్ రావిపుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మరి సుకుమార్ తో ముందుంటుందా లేక అనీల్ రావిపుడితోనా అన్నది తెలియాల్సి ఉంది. అనీల్ రావిపుడి సినిమా కన్ ఫాం అయితే అది మళ్లీ దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news