మహేష్ ‘మహర్షి’ స్టోరీ లీక్..!

-

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. మే 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. రీసెంట్ గా సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ చూసి కథ ఇదే అంటూ ఫిల్మ్ నగర్ లో ఓ స్టోరీ చెక్కర్లు కొడుతుంది.

మహేష్, అల్లరి నరేష్, పూజా హెగ్దెలు క్లాస్ మెట్స్ అని.. అయితే అల్లరి నరేష్ పేద కుటుంబానికి చెందిన వ్యక్తని.. అయితే ఊరు బాగు కోసం తన ప్రాణాలు కోల్పోతాడని.. అయితే కలిసి చదువుతున్న స్నేహితుడి కోసం అతని ఆశయం కోసం మహేష్ అదే ఊరికి వస్తాడట. అలా నరేష్ చేయాలనుకున్న పనిని హీరో రిషి అలియాస్ మహేష్ ఎలా పూర్తి చేశాడు అన్నది మహర్షి కథ.



దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news