క‌రోనా ఎఫెక్ట్ : మ‌హేశ్ స‌ర్కారువారి పాట ఫ‌స్ట్ సింగిల్ వాయిదా

క‌రోనా వైర‌స్ దేశ వ్యాప్తంగా ఎన్నో రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. అలాగే సినిమా రంగంపై కూడా ప్ర‌భావం కాస్త ఎక్కువ గానే చూపుతుంది. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా సినిమాల షూటింగ్ లు, విడుద‌లలు వాయిదా ప‌డ్డాయి. తాజా గా టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మ‌హేశ్ బాబు స‌ర్కారు వారి పాట సినిమా పై కూడా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ప‌డింది. అన్ని కుదిరితే ఇప్ప‌టికి ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వ‌చ్చేది. కాని క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో అప్ డేట్ వాయిదా ప‌డింది.

శుక్ర‌వారం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ థ‌మ‌న్ స‌ర్కారు వారి పాట సినిమా నుంచి అప్ డేట్ వ‌స్తుందంటూ ట్వీట్ చేశాడు. అతి త్వ‌ర‌లో ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రాబోతుందని థ‌మ‌న్ అనౌన్స్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన కొంత స‌మ‌యం త‌ర్వాతే.. మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్వీట్ చేసింది. త‌మ చిత్ర బృందంలో క‌రోనా వ్యాప్తి కార‌ణంగా స‌ర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఆల‌స్యం అవుతున్నాయ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ప్రిన్స్ మ‌హేశ్ అభిమానుల‌కు మ‌రోసారి నిరాశ ఎదురు అయింది.