మామునూర్‌లో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా మామునూర్‌లో తీవ్ర ఉద్రికత్త చెలరేగింది. మామునూరు ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. వరంగల్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే.
- వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్టు క్రెడిట్ కోసం కొట్టుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
- ఎయిర్పోర్టు క్రెడిట్ తమదంటే తమదంటూ అంటూ బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ
- మోడీకి పూలాభిషేకం చేసేందుకు మామునూరు ఎయిర్ పోర్టు దగ్గరకు వచ్చిన బీజేపీ శ్రేణులు
- కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్పోర్టు రెడీ అవుతుంది అని కాంగ్రెస్ శ్రేణుల వాదన
- ఇరువర్గాల మధ్య తోపులాట.. అడ్డుకున్న పోలీసులు