ఎన్టీఆర్ కు గొప్ప నివాళి..!

-

ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రగా ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా రానుంది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ మొదటి పార్ట్ బుధవారం రిలీజైంది. ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. నిన్న రిలీజ్ అయిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు మంచి టాక్ తెచ్చుకుంది. కొన్నిచోట్ల టాక్ అంతగా లేకున్నా ఫైనల్ గా సంక్రాంతి సందడిలో ఎన్.టి.ఆర్ జోష్ మొదలు పెట్టాడు.

ఇక ఈ సినిమా చూసిన స్టార్స్ తమ రెస్పాన్స్ తెలియచేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది డైరక్టర్స్ ఎన్.టి.ఆర్ కథానాయకుడిపై తమ రెస్పాన్స్ అందించగా.. లేటేస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ ఎన్.టి.ఆర్ కథానాయకుడి మీద తన స్పందన తెలియచేశాడు. ఎన్.టి.ఆర్ కు ఇది గొప్ప నివాళి అని.. బాలకృష్ణ గారు ప్రతి సీన్ లో అద్భుతంగా చేశారని అన్నాడు. అంతేకాదు ఒకవేళ దీన్ని మించిన సినిమా ఏదైనా ఉంటుంది అంటే అది ఎన్.టి.ఆర్ మహానాయకుడే అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version