SSMB 28 విషయంలో మహేష్ అభిమానులకు తప్పని నిరాశ..!

-

గత కొన్ని నెలలుగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకపోవడం గమనార్హం. మహేష్ బాబు త్రివిక్రమ్ తయారు చేసిన కథలో కొన్ని మార్పులు సూచించడం వల్ల కొన్ని రోజులు సినిమా షూటింగ్ వాయిదా పడితే.. మరికొన్ని రోజులు మహేష్ బాబు కుటుంబంలో విషాదఛాయలు అలుముకోవడం , ఆ తర్వాత ఆయన విదేశాలకి వెళ్లిపోవడం అలా కొన్ని రోజులు సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే సెప్టెంబర్ లోపు సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.

ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళితో తనతో 29వ సినిమాని మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 మూవీ విషయంలో అభిమానులకు మాత్రం నిరాశ తప్పడం లేదు అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మరొకసారి ఈ సినిమాకు బ్రేక్ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ముందుగా హీరోయిన్, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆఖరికి త్రివిక్రమ్ ఏదో విధంగా సర్దుబాటు చేశారు. కేజీఎఫ్ ఫైట్ మాస్టర్లను కూడా తీసుకొచ్చారు.

షూటింగ్ పూర్తయింది.. కానీ హీరోకి వాళ్ళ పనితనం నచ్చలేదు.. దాంతో చేసిందంతా పక్కన పడేశారు. ఇక ఫైట్ మాస్టర్లను మార్చి మళ్లీ రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసి షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఇంత కష్టపడినా కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది. ఇక లేటెస్ట్ గా మహేష్ బాబు మళ్లీ విదేశాలకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు షూటింగ్ మొదలు కావాల్సి ఉంది ఇలాంటి సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ వచ్చి మహేష్ బాబుకు షాకింగ్ విషయం చెప్పినట్లు సమాచారం. అదేమిటంటే ఒక మాల్ లో చేసిన శ్రీ లీల, మహేష్ బాబు కాంబో సీన్లు మొత్తం స్క్రాప్ చేస్తున్నట్లు త్రివిక్రమ్ చెప్పారన్నది వినిపిస్తున్న న్యూస్. షాట్ తనకు సంతృప్తిగా రాలేదని త్రివిక్రమ్ చెప్పడంతో హీరో కాస్త చిరాకు పడినట్లు సమాచారం. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version