ఖుషి మ్యూజికల్ ఈవెంట్ లో విజయ్ ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?

-

విజయ్ దేవరకొండ ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు మీమర్స్ కి మంచి స్టఫ్ ని అందిస్తాయని చెప్పవచ్చు. అయితే ఈయన కావాలని మాట్లాడతాడో లేక యాదృచ్ఛికంగా అలా జరుగుతుందో తెలియదు కానీ విజయ్ చేసే కామెంట్లు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే హైదరాబాదులో తాజాగా ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ కన్సర్ట్ పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించగా ఇందులో వారు మాట్లాడిన మాటలే కాదు విజయ్ దేవరకొండ ధరించిన డ్రెస్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించి సందడి చేశారు . సమంతతో కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ఇకపోతే విజయ్ ధరించిన వైట్ కలర్ కోట్ , పలోజా మోడల్ ఫాంట్ చాలా డిఫరెంట్ గా అనిపించాయి. అయితే నెటిజన్స్ దీనిని కూడా ఫన్నీ గానే ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే దీని ధర అక్షరాలా రూ.2 లక్షలట. మరోవైపు విజయ్, సమంత ఖుషి సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే నెటిజన్స్ కూడా పలు సినిమాలతో దీనిని పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

హీరో హీరోయిన్ల మధ్య గొడవలు రావడం, హీరోయిన్ ఇంట్లో నుంచి బయటకు రావడం వంటి సన్నివేశాలు మణిరత్నం సఖి సినిమాలో ఉన్నట్లు ఉన్నాయని దీనిపై కూడా సినిమా చూస్తే గాని ఒక క్లారిటీ రాదు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసింది. సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం అభిమానుల సైతం చాలా ఎదురు చూస్తున్నారు. మరి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news