షారుక్ ఆ సాంగ్ కు ఐదుగురు హీరోయిన్స్ నో.. ఎస్ చెప్పి స్టార్ స్టేటస్ అందుకున్న మలైకా..

-

తన గ్లామర్ తో ఇప్పటికి ఎక్కువగా కారణం పిచ్చెక్కిస్తున్న భామ మలైకా అరోరా.. షారుక్ తో ఆమె చేసిన ఓ సాంగ్ తనకు ఎంత స్టార్ స్టేటస్ అని తీసుకొచ్చిందో తెలిసింది అయితే ఈ సాంగ్ కు మొదటగా మలైకాను అనుకోలేదంట.. మరి ఎవరిని అనుకున్నారు ఈ అవకాశం మలైకాన్ని ఎలా వరించిందో ఒకసారి చూద్దాం..

స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన దిల్ సే చిత్రంలో చల్‌ ఛయ్యా ఛయ్యా సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది ఇప్పటికే ఆ సాంగ్ వింటే ఎక్కడిలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సాంగ్లో షారుక్ తో కలిసి చిందేసిన భామ మలైకా అరోరా ఈ సాంగ్ అంత సూపర్ హిట్ అవడంతో ఆమెకు ఎక్కడలేని స్టార్ స్టేటస్ వచ్చేసింది అయితే ఇందుకోసం మొదటగా మలైకాను అనుకోలేదంట ఐదుగురు హీరోయిన్లు అడగగా వారంతా నో చెప్పడంతో ఈ అవకాశం వరించిందని తాజాగా మూవీంగ్‌ ఇన్‌ విత్‌ మలైకా ప్రారంభ కార్యక్రమంలో తెలిసింది..

ఈపాట కోసం మొదట ఆమెను అనుకోలేదని డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ఫర్హా ఖాన్‌ తెలిపారు. “మలైకా నువ్వు ఎప్పటికీ ఛయ్యా ఛయ్యా అమ్మాయివే. నీ అదృష్టం బాగుంది. సుమారు ఐదుగురు నటీమణులు నిరాకరించడంతో ఆ పాట నిన్ను వరించింది. మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది… మలైకాతో ఈ పాట చేయాలని మేము అస్సలు అనుకోలేదు. మా జాబితాలో ఆమె పేరు కూడా లేదు. మొదట మేము శిల్పాశెట్టి, తర్వాత శిల్పా శిరోద్కర్‌తోపాటు మరో ముగ్గురు హీరోయిన్స్‌ని కలిశాం. ఒక్కరేమో కదిలే ట్రైన్‌పై డ్యాన్స్‌ అంటే భయపడ్డారు. మరొకరు అందుబాటులో లేరు. అలాంటి సమయంలో నా మేకప్‌ మేన్‌ మలైకా మంచి డ్యాన్సర్‌ అని చెప్పాడు. అలా ఆమెను ఈ పాటలో డాన్స్ చేయటానికి ఒప్పించాం.. . సాంగ్‌ షూట్‌ మొదలయ్యాక కూడా సరిగ్గా చేస్తుందా? లేదా? అని కంగారు పడినా.. ఆమె తన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది” అని ఫర్హా ఖాన్‌ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version