మళయాల నటుడు షైన్ టామ్ చాకోకు బెయిల్ వచ్చింది. డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్టయ్యారు. డ్రగ్స్ మత్తులో తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశారు నటి. దసరా సినిమాలో విలన్‌గా నటించిన షైన్ టామ్ చాకో…. నిన్న అరెస్టయ్యాడు. ఇటీవల ఓ హోటల్‌పై డ్రగ్స్ రైడ్ జరిగిన సమయంలో షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన నిన్న పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎందుకు పరారైనట్లు ప్రశ్నించినట్లు తెలిసిందే. అలాగే డ్రగ్స్ వినియోగంపైనా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారించిన అధికారులు వెంటనే అరెస్టు చేశారు.అయితే అరెస్ట్ ఐన గంటలోనే మళయాల నటుడు షైన్ టామ్ చాకోకు బెయిల్ వచ్చింది.