చంద్రబాబు బర్త్ డే… పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్వీట్ !

-

చంద్రబాబు బర్త్ డే నేపథ్యంలో…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్వీట్ చేశారు. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం అన్నారు.

pawan kalyan tweet on chandrababu birthday
pawan kalyan tweet on chandrababu birthday

అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ చంద్రబాబు గారి విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం అని పేర్కొన్నారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news