మ‌రో వివాదంలో చిక్కుకున్న మంచు ల‌క్ష్మీ..

అదేంటో గానీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటారు మంచుల‌క్ష్మీ. ఆమె మంచిగానే ఆలోచించి పోస్టులు పెట్టినా.. చివ‌రికి అవి వ‌వాదాస్ప‌దంగా మారుతుంటాయి. ఇక అక్క‌డితో నెటిజ‌న్లు ఆమెను ఆటాడుకోవ‌డం స్టార్ట్ చేస్తారు. మొన్న‌టికి మొన్న కేటీఆర్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది.

ఆయ‌న‌కు క‌రోనా వ‌స్తే.. నా సినిమాలు చూడు బుడ్డీ అంటూ పోస్టు చేసి విమ‌ర్శ‌ల పాలైంది. ఇప్పుడు మ‌రో పోస్టు అలాగే మారింది. ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో భ‌యాల‌న్నీ పోయి ధైర్యంగా ఉండాలంటే పెండ్లి వీడియోలు చూడండి అంటూ న‌వ్వుతున్న ఎమోజీతో పోస్టు చేసింది.

ఇక అంతే నెటిజ‌న్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. నీ పెళ్లి వీడియోలు పెట్టు చూస్తాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. సాయం చేయ‌డం మానేసిఈ పోస్టులు ఏంటంటూ ఆడుకుంటున్నారు. ఇక ఈ పోస్టు కాస్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మ‌రి దీనిపై మ‌ళ్లీ ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.