షూటింగ్ లో గాయపడ్డ మంచు విష్ణు.. ఫోటోలు వైరల్

-

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “జిన్నా”. హీరోగా చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ఇప్పుడు జిన్నా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, కోనా వెంకట్ అందించారు.

ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం భాషలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటించారు. వాళ్ళిద్దరితో కలిసి ఈ జిన్నా మూవీ కోసం ప్రమోషన్ ఫుల్లుగా ప్లే చేస్తున్నారు మంచు విష్ణు.

ఇది ఇలా ఉండగా..తాజాగా హీరో మంచు విష్ణు..జిన్నా మూవీ షూటింగ్ సెట్ లో గాయపడినట్లుగా తెలుస్తోంది. డ్యాన్స్ చేస్తుండగా కాలికి గాయమైంది అంటూ తన ఇన్స్టా స్టోరీలో పిక్ షేర్ చేశారు. విష్ణు ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన దీనిపై ఆసుపత్రికి వెళ్లారా? లేక ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news